హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీప్తిశ్రీనగర్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

RR: దీప్తిశ్రీనగర్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో శేరిలింగంపల్లి బీజేపీ అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. శ్రీ సప్తముఖ ఆంజనేయస్వామి, దత్తాత్రేయ, శివపంచాయతన, వ్యాస మహర్షి సహిత నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.