హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులతో సందడిగా గూడెం దేవాలయం

MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులుతో కిటికీటలాడింది. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా శుక్రవారం మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల నుండి భక్తులు దేవాలయానికి భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే 648 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాయి.