ములుగు జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ సోమసుందరం మెమోరియల్ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడు రమేశ్ రూ.55 వేల విలువైన 12 బెంచీలను విరాళంగా అందజేశారు. శుక్రవారం మండల విద్యాధికారి వజ్జ తిరుపతి, వార్డు కౌన్సిలర్ గుగ్గిళ్ల దివ్య చేతుల మీదుగా బెంచీల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా రమేశ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.
తెలంగాణ
గొప్ప మనస్సు చాటుకున్న ఉపాధ్యాయుడు


