VKB: బొంరాస్పేట్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపై సూచిక బోర్డులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల పేర్లు తెలిపే బోర్డులు లేకపోవడంతో కొత్తగా వచ్చే వారు దారులు గుర్తించలేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల ప్రవేశ మార్గాల్లో పేర్లతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గ్రామాల ప్రవేశ మార్గాల్లో బోర్డులు ఏవీ?


