హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BHNG: భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన 18–59 ఏళ్ల వారికి రూ.5 లక్షల బీమా భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మహిళా సమాఖ్య నూతన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.