హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సాపూర్‌కు 7 కొత్త పింఛన్లు

NZB: బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామానికి ఏడు కొత్త ఆసరా, చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. గ్రామ సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ శుక్రవారం ఈ వివరాలు తెలిపారు. లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసినందుకు గ్రామ పంచాయతీ, గ్రామస్తుల తరఫున ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్తగా పింఛన్లు పొందనున్న కుటుంబాల్లో ఈ నిర్ణయం ఆనందం నింపిందని గ్రామస్తులు పేర్కొన్నారు.