KMM: చింతకాని మండలం నేరడ గ్రామంలోని పత్తి చేనులో శుక్రవారం సుమారు 70 కిలోల భారీ కొండచిలువ కనిపించడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సర్పంచ్ దూసరి నేతాజీకి సమాచారం అందించగా, ఆయన అటవీ శాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, స్థానికుల సహకారంతో కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు.
తెలంగాణ
పత్తి చేనులో భారీ కొండచిలువ


