హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం'

WNP: బీఆర్ఎస్ నేత వాసుదేవ్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంత చారి ఫ్యామిలీని కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకున్నట్లు తెలిపారు. రూ. 10 లక్షల ఆర్థిక సహాయం సహా శ్రీకాంత చారి సోదరుడికి ఉద్యోగం ఇచ్చినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు 2014లో శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లు తెలియజేశారు.