SDPT: హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్డుపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోతారం (ఎస్) గ్రామానికి చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరికి గాయాలు


