హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.