హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌లో ఫ్లెక్సీ వివాదం

MDCL: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ బీమా కార్యక్రమంలో ఫ్లెక్సీ వివాదం చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫొటోకు బదులుగా రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ చిత్రాన్ని ముద్రించడం చర్చనీయాంశమైంది. నిర్వాహకుల పొరపాటుపై BRS నేతలు విమర్శలు గుప్పించారు. ఫొటోను గుడ్డిగా వాడటం పట్ల తీవ్ర విమర్శలకు దారి తీసింది