హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని వినతి

SRD: వృద్ధాప్య, బోదకాలు, చేనేత తదితర 14 రకాల సామాజిక భద్రతా పింఛన్లను అర్హులందరికీ వెంటనే మంజూరు చేయాలని సిర్గాపూర్ మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంపీడీవో ఆండాలమ్మకు మండల అధ్యక్షుడు సంజీవరావు తదితరులు వినతిపత్రం అందజేశారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.