హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత ఉపకరణాల శిబిరం

KNR: చిగురుమామిడి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో రేపు ఉదయం 9 గంటలకు ఉచిత సహాయ ఉపకరణాల నమోదు శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ADIP పథకం కింద శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్హులు ఆధార్, సదరం లేదా UDID కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో రావాల్సి ఉంటుందని సూచించారు.