హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిగి బస్టాండ్ వద్ద ప్రమాదకరంగా ఇనుప రాడ్లు

VKB: పరిగి RTC బస్టాండ్ ముఖద్వారం వద్ద అండర్ డ్రైనేజీపై ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లు ప్రమాదకరంగా మారాయి. నిత్యం వాహనాల రాకపోకలు సాగించే మార్గంలో రాడ్లు బయటకు కనిపిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిపై సిమెంట్ బెడ్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.