హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికులకు అందని ATM సేవలు

VKB: పరిగి ఆర్టీసీ బస్టాండ్‌లో ఏళ్లుగా మూతపడి ఉన్న ATMలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొడంగల్, హైదరాబాద్, వికారాబాద్, షాద్‌నగర్ ప్రాంతాలకు నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నగదు అవసరమైనప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి బస్టాండ్‌లో ఏటీఎం సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.