హైదరాబాద్: 28°C
తెలంగాణ

షూటింగ్ బాల్ పోటీలకు ఆసిఫాబాద్ విద్యార్థులు

ASF: రేపటి నుంచి ఈ నెల 23 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు ఆసిఫాబాద్ ఖేలో ఇండియా కేంద్రం విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను DD TW అంబాజీ, DSO షేకు, GCDO శకుంతల, ATDO చిరంజీవి, హెడ్‌మాస్టర్ చంద్రశేఖర్ శుక్రవారం అభినందించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.