MLG: తాడ్వాయి మండలం మేడారం బాలికల, ఊరట్టం ఆశ్రమ పాఠశాలలను శుక్రవారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల బ్యాంకు ఖాతాలు, ఆధార్ నమోదు ప్రక్రియను పరిశీలించి పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మైండ్స్పార్క్ కంప్యూటర్ తరగతులు, విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు. విద్యా ప్రమాణాలు పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.
తెలంగాణ
పాఠశాలల తనిఖీలో ఐటీడీఏ పీఓ


