KMR: తాడ్వాయి మండలం దేవయిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. కుటుంబ సంపాదనాపరుడి పేరుతో తీసుకునే ఈ పాలసీలో, ఆయన మరణిస్తే కుటుంబానికి లేదా నామినీకి రూ.5 లక్షలు అందుతాయి. రేషన్ కార్డు లేనివారికీ అవకాశం ఉంది. సర్పంచ్ నరేశ్, ఎంపీడీవో భరత్ కుమార్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
దేవయిపల్లిలో ఇందిరమ్మ బీమా ప్రారంభం


