హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రి, పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను శుక్రవారం కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది వివరాలు, హాజరు రిజిస్టర్, మెడిసిన్ స్టాక్‌ను పరిశీలించారు. మోడల్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.