హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత్రికేయ రంగంలో మహిళలకు ప్రాధాన్యం: కలెక్టర్

NRML: పాత్రికేయ రంగంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ప్రెసెక్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో సమాజంలో మహిళా పాత్రికేయుల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లుగానే జర్నలిజంలోనూ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు.