హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాఖాహారం, ధ్యానంపై అవగాహన ర్యాలీ

MBNR: శాఖాహారం, ధ్యానం ఆవశ్యకతపై మిడ్జిల్ మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధ్యాన కేంద్రాన్ని బ్రాహ్మణ రత్న మారం శివప్రసాద్, బంగ్లా ఆంజనేయ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవనం కోసం శాఖాహారం తీసుకోవాలని, నిత్యం ధ్యానం అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.