BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ 9వ వార్డు శివాజీనగర్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఛైర్‌పర్సన్ మొగుదాల పావని రమేశ్‌గౌడ్ ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని కమిషనర్ ఎన్.వెంకటేశ్వర నాయక్ తెలిపారు. రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులతో వార్డు ఇంఛార్జిని సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
చౌటుప్పల్‌లో ఇందిరమ్మ బీమా ప్రారంభం


