హైదరాబాద్: 28°C
తెలంగాణ

వార్డు కార్యాలయాల్లో బీమా రిజిస్ట్రేషన్లు షురూ

HYD: కూకట్‌పల్లి జోన్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జోన్ పరిధిలోని వివిధ వార్డు కార్యాలయాల్లో నమోదు ప్రక్రియ కొనసాగుతోందని జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తెలిపారు. అర్హులైన వారు తమ వార్డు కార్యాలయాలను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులకు సిబ్బంది అవసరమైన సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.