హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుంతపై వీడియో.. అంతలోనే ప్రమాదం!

HYD: నగరంలోని ఖాజాగూడ మెయిన్ రోడ్డులోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా ప్రమాదకర గుంత ఏర్పడింది. రత్నదీప్, అపోలో ఫార్మసీ మధ్య రోడ్డును తవ్వి అలాగే వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై GHMCకి ఫిర్యాదు చేసేందుకు వీడియో తీస్తున్న సమయంలో ఓ బైకర్ స్కిడ్ అయి కిందపడ్డాడు. ఇలాంటి నిర్లక్ష్యంతో ప్రాణనష్టం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.