KNR: శంకరపట్నం మండలం అంబాలపూర్లో కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో 'ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్' కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఎంపికైన 20 మంది రైతుల్లో 14 మందికి ఒక్కొక్కరికి 8 కిలోల ఎంజీజీ-385 పెసర విత్తనాలు, ఆరుగురికి జేసీఎస్-1020 నువ్వుల విత్తనాలు అందించారు. విత్తన శుద్ధి, సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ఏఆర్ఎస్ అధిపతి డాక్టర్ రాంప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ
అంబాలపూర్లో రైతులకు విత్తన పంపిణీ


