KNR: సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శుక్రవారం మొదలైంది. రేషన్ కార్డు ఉన్న 18 నుంచి 59 ఏళ్ల వారు అర్హులని, ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఊరిలో లేనివారు కుటుంబ సభ్యుల ద్వారా నమోదు చేసుకోవాలని సర్పంచ్ మాకల స్వప్న సూచించారు. రాజకీయాలకతీతంగా అర్హులందరినీ చేర్పించాలని కోరారు.
తెలంగాణ
లస్మన్నపల్లిలో ఇందిరమ్మ బీమా నమోదు


