హైదరాబాద్: 28°C
తెలంగాణ

వసతి గృహాల సమస్యలపై టీఎన్జీవో వినతి

మంచిర్యాల జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గాదియారం శ్రీహరి నేతృత్వంలో నాయకులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన సరుకులు, ఇతర సౌకర్యాలు అందించి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. హాస్టల్ సంక్షేమాధికారుల సంఘం నేతలు మొహసిన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.