హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయాలు స్ఫూర్తి కేంద్రాలుగా నిలుస్తాయి: కలెక్టర్

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ హరిత పాల్గొని మాట్లాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా నిలుస్తున్నాయని, విద్యార్థులకే కాకుండా అన్ని రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. గ్రంథాలయాలు స్ఫూర్తి కేంద్రాలుగా నిలుస్తాయన్నారు.