హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి'

JGL: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి ప్రారంభమై శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. జగిత్యాలలో వారం రోజులుగా నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా జరిగిన పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దినేశ్, మున్సిపల్ ఛైర్మన్ సమిండ్ల వాణి, DEO రాము బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.