JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి చందనోత్సవ మహా సంప్రోక్షణలో భాగంగా 40 రోజుల నిజరూప దర్శనం సందర్భంగా తెలంగాణలోని 12 ప్రముఖ ఆలయాల నుంచి స్వామి వారికి పట్టు వస్త్రాలు రానున్నాయి. ఇవాళ మొదటి పట్టు వస్త్రాలు,శేష మాలలు భద్రాచలం శ్రీ సీతారాములవారి నుంచి కొండగట్టుకు చేరుకున్నాయి.ఆలయ అధికారులు,అర్చకులు సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికి, స్వామివారికి సమర్పించారు.
తెలంగాణ
భద్రాచలం నుంచి కొండగట్టుకు చేరుకున్న పట్టు వస్త్రాలు


