హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామీణ విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీతకు క్విజ్ పోటీలు: కలెక్టర్

MDK: చిన్నశంకరంపేట, మండల కేంద్రంలోని కేజీబీవీలో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన మండల స్థాయి క్విజ్ పోటీలను కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. ప్రశ్నల ప్రమాణాలను అడిగి తెలుసుకున్న ఆమె, విద్యార్థులను ప్రోత్సహించారు. పాఠ్యపుస్తకాలతో పాటు కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలని, ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.