MHBD: గార్ల మండల నూతన ఎంపీడీవోగా ఎం. సుజాత శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయానికి చేరుకున్న ఆమె అధికారికంగా విధుల్లో చేరారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. మండలంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేసేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
గార్ల ఎంపీడీవోగా సుజాత


