హైదరాబాద్: 28°C
తెలంగాణ

చౌటుప్పల్లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం

NLG: చౌటుప్పల్లోని NH-65పై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీని పరిశ్రమ సమీపంలో యూటర్న్ వద్ద లారీ, బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.