హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు

GDWL: అలంపూర్ మాంటిస్సోరి పాఠశాలకు చెందిన విద్యార్థులు నరసింహ, అనూష 70వ ఎస్జీఎఫ్ బాలబాలికల బాస్కెట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.నాగలక్ష్మి తెలిపారు. నవంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలో వీరిద్దరూ పాల్గొననున్నట్లు ఆమె వెల్లడించారు. వీరిని పలువురు అభినందించారు.