RR: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని' కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నారు. అర్హులైన వారందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పడకల్లో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం


