హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా పథకాన్ని ప్రారంభించిన ఛైర్మన్

RR: శంకరపల్లి మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.