హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాభావం వేళ.. చెట్ల నరికివేత కలకలం

VKB: ఒకవైపు వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు దోమ మండలంలో అక్రమ చెట్ల నరికివేత కొనసాగుతోంది. పలు గ్రామాల శివార్లలో పొలాల గట్లపై ఉన్న విలువైన వేప, తుమ్మ చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికివేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి అక్రమ నరికివేతను అడ్డుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.