హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు జల సంరక్షణపై అవగాహన

PDPL: రామగుండం కార్పొరేషన్లోని లింగాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు జల సంరక్షణపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ అంగోతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జల ప్రతిజ్ఞ చేయించారు. నీరు అమూల్యమైన వనరని, భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటి నిల్వ ద్వారా నీటిని సంరక్షించాలన్నారు.