PDPL: మంథనికి చెందిన తూర్పాటి సత్యనారాయణ తన ఫొటోగ్రఫీ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఫ్రాన్స్, ఇటలీ, మొనాకో దేశాలు నిర్వహించిన ‘రామోగే’ పోటీలో ఆయన చిత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. వేలాది ఫొటోల మధ్య సముద్రం, మనిషి అనుబంధంతో పాటు గిరిజన మహిళ జీవనశైలిని సహజంగా ఆవిష్కరించిన ఆయన చిత్రం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.
తెలంగాణ
ఫోటోగ్రఫీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ


