SRCL: వేములవాడ పట్టణంలోని 15వ వార్డు సంతోష్‌నగర్, 25వ వార్డులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాలను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం జరిగితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'ఇందిరమ్మ జీవిత బీమాతో పేద కుటుంబాలకు భరోసా'


