హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్లెక్సీ తొలగింపుపై బీఆర్ఎస్ ఆందోళన

SDPT: హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే ఫ్లెక్సీ తొలగించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు తొలగించిన ఫ్లెక్సీతో రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.