హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రూప్-2 కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

VKB: మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో TGPSC గ్రూప్-2 పోటీ పరీక్షలకు ఉచిత ఫౌండేషన్ కోచింగ్ అందించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శుక్రవారం తెలిపారు. ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, పార్శీ, బౌద్ధ మైనారిటీ వర్గాలకు చెందిన డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 26తో దరఖాస్తుల గడువు ముగుస్తుందని వెల్లడించారు.