హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాజువాకలో రోడ్లపై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు

VSP: జీవీఎంసీ 101 వార్డ్ మంగలపాలెం, వైట్ బిల్డింగ్స్ పరిసరాల్లో క్వారీ నిమిత్తం భారీ వాహనాలు వెళ్లేందుకు కాలువను తాత్కాలికంగా మూసివేశారు. ఫలితంగా ఆ పరిసరాల్లో డ్రైనేజీ నీరు ప్రధాన రోడ్లపైనే ప్రవహిస్తోంది. తమ ఇళ్ల ముందు నుంచే డ్రైనేజీ నీరు ప్రవహిస్తుండటంతో స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.