హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది సన్నద్ధం

AKP: రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గొలుగొండ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ విధానాలు, ఎన్నికల నిబంధనలు, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.