KKD: జగ్గంపేటకు చెందిన గాయత్రి ఐశ్వర్యకు శబరిమలలో అరుదైన అవకాశం లభించింది. తన మూడో శబరియాత్ర సందర్భంగా మండల పూజ కోసం ఆలయం తెరిచిన తొలిరోజున స్వామివారి సన్నిధిలో హరివరాసనం కీర్తన ఆలపించింది. అనంతరం ఆ కీర్తనకు కూచిపూడి నృత్యంతో నీరాజనం సమర్పించింది. ఈ అవకాశం పూర్వజన్మ సుకృతమని ఆమె తండ్రి, గురుస్వామి మామిళ్లపల్లి అయ్యప్ప తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శబరిమలలో చిన్నారికి అరుదైన అవకాశం


