హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్రసాము పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు

AKP: పాయకరావుపేట మండలం సత్యవరంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు కర్రసాము పోటీల్లో ప్రతిభ చాటారు. అనకాపల్లిలో ఈనెల 19న జరిగిన ఎస్‌జీఎఫ్‌ఐ పోటీల్లో అండర్‌-19 విభాగంలో 5గురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం మహేశ్వరరావు తెలిపారు. ఎంపికైన గీతిక, జయలక్ష్మి, పాలపర్తి శ్రీకిరణ్, బత్తుల శ్రీను, మొగసాల చంద్రశేఖర్ ను పలువురు అభినందించారు.