హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుకు 5 ఇళ్లల్లో ధ్వంసమైన గృహోపకరణాలు

SKLM: జిల్లా కవిటి మండలం సహాలాలపుట్టుగ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పిడుగు పడింది. ఈ దాటికి నాలుగు ఇళ్లల్లో విద్యుత్ లైన్ తోపాటు గృహోపకరణాలు ధ్వంసం అయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాలతో మాట్లాడి ఆధారాలు సేకరించారు.