KMM: వైరా పట్టణంలోని సెల్‌ఫోన్ దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై పీట్ల ప్రవీణ్ కుమార్ సూచించారు. పోలీస్ స్టేషన్‌లో దుకాణ యజమానులతో సమావేశమై దొంగతనాల నివారణకు పలు సూచనలు చేశారు. షాపు ముందు రెండు, లోపల రెండు కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఖరీదైన ఫోన్లను రాత్రివేళ ఇంటికి తీసుకెళ్లాలని తెలిపారు.
తెలంగాణ
'సెల్‌ఫోన్ షాపుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి'


