సూర్యాపేట: పట్టణంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీగూడెం నుంచి వ్యవసాయ మార్కెట్కు వెళ్లే దారిలో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ, స్కూటీ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
టిప్పర్ ఢీకొని ఇద్దరి మృతి


