హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 25న జిల్లా స్థాయి పారా క్రీడా ఎంపికలు

SKLM: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3)ను పురస్కరించుకుని ఈ నెల 25న జిల్లా స్థాయి పారా క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేష్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 7680075375 నంబరును సంప్రదించాలని కోరారు.